Sara Tendulkar: ఈ-క్రికెట్ లీగ్‌లో ముంబయి యజమాని 4 d ago

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ముంబయి ఫ్రాంచైజీ యజమానురాలిగా నియమితులైనందుకు జెట్సింథెసిస్ సంతోషం వ్యక్తం చేసింది. సారా ఫ్రాంచైజీ యాజమాన్య బాధ్యతలు స్వీకరించడం ముంబయిలో ఆమెకు ఉన్న బలమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని, డిజిటల్ యుగంలో క్రికెట్ విస్తృతిని పెంచడంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని జెట్సింథెసిస్ సీఈఓ రాజన్ నవనీ అభిప్రాయపడ్డారు. జీఈపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది, ఇది రియల్ క్రికెట్‌ను 30 లక్షల డౌన్లోడ్లకు చేరువగా తీసుకువెళ్లింది.